: చంద్రబాబు నిర్ణయం వెనుక బాలకృష్ణ సూచన!
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాస్తు, జ్యోతిష్యాలను విశేషంగా నమ్ముతారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన దగ్గరుండి మరీ కొన్ని వాస్తుపరమైన మార్పులు చేయించారు. ఎన్నికల్లో టీడీపీ నెగ్గడంతో బాలయ్య వాస్తు సెంటిమెంటుకు విశ్వసనీయత చేకూరింది. తాజాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు మారుతున్న సంగతి తెలిసిందే. వియ్యంకుడు బాలకృష్ణ సూచన మేరకే బాబు పాత నివాసం స్థానంలో కొత్త నిర్మాణానికి ఉపక్రమించినట్టు తెలుస్తోంది. కాగా, ఆ నిర్మాణ పనులను బాలయ్యే పర్యవేక్షించనున్నారట. అటు లోకేశ్, బ్రాహ్మణి త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. దీంతో, ఓ చిన్నారి చంద్రబాబు కుటుంబంలోకి రానుండగా, ఆ బుజ్జాయి ఆటపాటలకు అనువుగా ఉండేందుకు వీలుగా నూతన నిర్మాణం చేపట్టనున్నారట.