: పనిచేయడానికి ఇది భేషైన నగరం


పనిచేసేందుకు అనువైన నగరంగా లండన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ద బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, టోటల్ జాబ్స్.కామ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. రెండు లక్షల మందికి పైగా పనిచేయడానికి భేషైన నగరంగా లండన్ కు ఓటేశారు. ఈ సర్వే కోసం ప్రశ్నించిన వారిలో ప్రతి ఆరుగురిలో ఒకరు లండన్ కు తరలివెళ్ళేందుకు ఉత్సాహం చూపారట. మొత్తం 189 దేశాలకు చెందిన వ్యక్తులను ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. ఈ సర్వేలో లండన్ తర్వాత స్థానాల్లో న్యూయార్క్, పారిస్ నిలిచాయి. ఇక, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న దేశాల పరంగా చూస్తే, అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో బ్రిటన్ ఉంది.

  • Loading...

More Telugu News