: ‘‘అమ్మకు న్యాయం కోసం’’ 350 కిలోమీటర్ల పాదయాత్ర!


పురుచ్చితలైవి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు న్యాయం జరగాలని కోరుతూ పార్టీ కార్యకర్తలిద్దరు 350 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టారు. ‘అమ్మకు న్యాయం కోసం’ పేరిట అన్నాడీఎంకే కార్యకర్తలు మధిల్ పెరుమాళ్, సియాన్ దువియెర్ లు చెన్నై నుంచి బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారం వరకు పాదయాత్ర చేపట్టారు. జయలలితకు అన్యాయంగా శిక్ష విధించారని భావిస్తున్న వారిద్దరూ, అందుకు నిరసన తెలుపుతూ నల్లదుస్తులు ధరించి ఈ నెల 1న చెన్నైలో పాదయాత్ర మొదలుపెట్టారు. తాజాగా, సోమవారం నాటికి వారు బెంగళూరుకు సమీపంలోని క్రిష్ణగిరి దాటారు. మంగళవారం రాత్రికి బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగార పరిసరాలకు చేరుకుంటారని భావిస్తున్నారు. జయలలితపై వీరు చూపుతున్న అభిమానం, జయ మరో అభిమాని సౌందరాజన్ ను కదలించింది. అంతే, ఆయన కూడా వీరి పాదయాత్రలో భాగమయ్యారు. ‘అమ్మకు బెయిల్ లభించే దాకా మేం చెన్నై తిరిగొచ్చేదే లేదు’ అంటూ వారు ప్రతిజ్ఞ చేశారు. మరి వీరి యాత్ర జయకు బెయిల్ ఇప్పిస్తుందో, లేదో చూడాలి.

  • Loading...

More Telugu News