: జయ దత్తపుత్రుడి పెళ్లి కోసం... వధువు బంధువు పేరిట బ్యాంకు అకౌంట్ ఓపెన్!
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత విచిత్ర విన్యాసాలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. కేసుకు మూలాధారంగా నిలిచిన తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం సందర్భంగా జయలలిత అనుసరించిన తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది. కోట్లాది రూపాయల ఖర్చుతో జరిగిన ఆ పెళ్లిలో వధువు బంధువు పేరిట ఓపెన్ అయిన ఓ బ్యాంకు అకౌంట్ ను పరప్పణ అగ్రహార కోర్టు న్యాయమూర్తి డికున్హా తన తీర్పులో ప్రధానంగా ప్రస్తావించారు. 1995లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఖర్చుల కోసమే వధువు బంధువు రామ్ కుమార్ పేరిట తెరిచిన సదరు బ్యాంకు అకౌంట్ లోకి కోట్లాది రూపాయలు వచ్చి చేరాయట. ఆ మొత్తం అంతా సమీప బంధువుల ద్వారానే వచ్చినప్పటికీ, ఎవరెవరి నుంచి ఎంత మొత్తం చేరిందన్న వివరాలు వెల్లడి కాలేదట. సాధారణంగా పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు, పొదుపు సొమ్ము విత్ డ్రా చేయడమో, ఆస్తులమ్మడమో, రుణాలు తీసుకురావడమో చేస్తుంటారు. అయితే జయలలిత మాత్రం విచిత్రంగా సదరు పెళ్లి కోసం కొత్త తరహాలో చక్రం తిప్పి, పెళ్లి ఖర్చుల కోసం వధువు బంధువు పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడం గమనార్హం.