: ‘ఆఖరు’ హెచ్ఎంటీ గడియారాలు... అదిరే రేటు!


హెచ్ఎంటీ గడియారాలు దేశవ్యాప్తంగానే కాక ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ప్రసిద్ధి చెందాయి. బ్యాటరీ లేకుండా యంత్రంతో పనిచేసే హెచ్ఎంటీ వాచీలంటే వినియోగదారులకు మరింత క్రేజీ. అయితే హెచ్ఎంటీ, తన గడియారాల ఉత్పత్తికి మంగళం పాడేసింది. ఈ క్రమంలో తన వద్ద మిగిలిపోయిన చివరి బ్యాచ్ వాచీలను బెంగళూరులో విక్రయాలకు పెట్టింది. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ వాచీలకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు హెచ్ఎంటీ వాటి ధరలను రెట్టింపు చేసేసింది. అయినా విక్రయాలు ఏమాత్రం తగ్గడం లేదట. రేటును పట్టించుకోని వినియోగదారులు, హెచ్ఎంటీ చివరి బ్యాచ్ వాచీలను చేజిక్కించుకునేందుకు ఎగబడుతున్నారట. నెలక్రితం రూ.1,200 పలికిన వాచీలు, ప్రస్తుతం రూ.2,400లు పలుకుతున్నాయట.

  • Loading...

More Telugu News