: రేపటి నుంచి ఐఫోన్-6 ప్రీ బుకింగ్స్


భారత్ లో యాపిల్ తాజా ఆవిష్కరణ ఐఫోన్-6 ప్రీ బుకింగ్ లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి యాపిల్ ఆథరైజ్డ్ స్టోర్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఐఫోన్-6, ఐఫోన్-6 ప్లస్ ల ధరలను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. తమ భాగస్వామ్య సంస్థలు ఇంగ్రామ్ మైక్రో, రెడింగ్టన్, రషి ఫెరిఫెరల్స్, రిలయన్స్ ల ద్వారా ధరలను త్వరలో వెల్లడిస్తామంటూ యాపిల్ ప్రకటించింది. ఐఫోన్-6 ధర అధికారికంగా ఖరారు కాకున్నా, కొన్ని ఈ-కామర్స్ సంస్థలు మాత్రం ఐఫోన్-6 ను రూ.56 వేలకే అందించనున్నట్లు ఆఫర్లిస్తున్నాయి.

  • Loading...

More Telugu News