: నా స్ట్రెయిట్ తెలుగు సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది: విశాల్


తాను నటించే స్ట్రెయిట్ తెలుగు సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని విశాల్ తెలిపాడు. తన కొత్త సినిమా పూజ ఆడియో విడుదల సందర్భంలో ఆయన మాట్లాడుతూ, తెలుగులో మంచి సినిమాతో రావాలనే ఉద్దేశంతోనే ఇంత విరామం తీసుకున్నానని అన్నాడు. పూజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నాడు. సినిమా ఆడియోకి వచ్చిన వారంతా తన కోసం వచ్చి, తన గురించి మాట్లాడుతారనుకుంటే శ్రుతి హాసన్ కోసం వచ్చారని వ్యాఖ్యానించి నవ్వించాడు. వేదికనెక్కిన అందరూ ఆమె గురించి మాట్లాడుతుంటే నితిన్, సందీప్ కిషన్ లు 'బాబాయ్, కాంపిటీషన్ ఎక్కువైపోతోందని' తెగ ఇబ్బంది పడిపోయారని అన్నాడు. సినిమాను కష్టపడి చేశామని, అభిమానులను, ప్రేక్షకులను, సినీ అభిమానులు అలరిస్తుందని విశాల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News