: విశాల్ ఎప్పుడు పిలిచినా నేనున్నానంటాడు: సందీప్ కిషన్


హీరో విశాల్ అంతటి మంచి వ్యక్తిని ఎవరూ చూడలేరని హీరో సందీప్ కిషన్ తెలిపారు. 'పూజ' సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాల్ అంటే పందెంకోడి సినిమా గురించే మాట్లాడుతారని, ఇకపై పూజ సినిమా పేరు చెబుతారని అన్నారు. చెన్నైలో అయినా, హైదరాబాదులో అయినా 'విశాల్ అన్నా' అని పిలిస్తే, అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఎప్పుడైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడని ఆయన తెలిపాడు. తాను కూడా విశాల్ కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News