: ఏమీ మారలేదు...మోడీ క్షమాపణలు చెప్పాలి: ఆనంద్ శర్మ


ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ముంబైలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, అది చేస్తాం, ఇది చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారం హస్తగతం చేసుకున్నారని అన్నారు. అరచేతిలో స్వర్గం చూపి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని ఆయన మండిపడ్డారు. వందరోజుల పాలనలో మోడీ చేసిందేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రజలకు మంచి రోజులు రాలేదు కానీ, బీజేపీ నేతలకు మాత్రం మంచి రోజులు వచ్చాయని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News