: గతం గురించి ఆలోచిస్తే... వర్తమానంలో ఏమీ సాధించనట్టే!: చిరంజీవి


గతం గురించి అల్లు రామలింగయ్య ఏనాడూ మాట్లాడేవారు కాదని కాంగ్రెస్ నేత చిరంజీవి తెలిపారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అల్లు రామలింగయ్య విగ్రహం ఆవిష్కరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వర్తమానంలో మనం ఏమీ సాధించనట్టేనని అన్నారు. గతం గురించి మాట్లాడితే భవిష్యత్ లో ఏమీ సాధించలేమని చిరంజీవి తెలిపారు. అందుకే తానెప్పుడూ గతం గురించి మాట్లాడలేదని, మాట్లాడనని ఆయన చెప్పారు. గతాన్ని మీరు గుర్తు చేయాలని ఆయన అభిమానులనుద్దేశించి అన్నారు. అల్లు రామలింగయ్య మాట్లాడితే పెద్ద గ్రంధాన్ని చదివినట్టని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయనతో మాట్లాడడాన్ని తాను ఆస్వాదించేవాడినని ఆయన తెలిపారు. అల్లు రామలింగయ్య గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News