: ప్రకాశ్ రాజ్, శ్రీను వైట్ల వివాదం సమసిపోతుంది: మురళీమోహన్
దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య తలెత్తిన వివాదం త్వరలోనే సమసిపోతుందని ప్రముఖ నటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని అన్నారు. అనారోగ్య కారణాల కారణంగా తాను కొంత కాలంగా బయటకు రాలేకపోయానని ఆయన తెలిపారు. అయితే గోదావరి పుష్కరాల నిధులపై కేంద్ర మంత్రులతో నిత్యం చర్చిస్తూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై దృష్టి సారించానని ఆయన తెలిపారు.