: రేపు సాయంత్రం నుంచి మాదాపూర్ లో 144వ సెక్షన్


హైదరాబాదులో ఆంక్షలు అమలులోకి రానున్నాయి. మెట్రోపొలిన్ సదస్సు నిర్వహించనున్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేపు సాయంత్రం నుంచి 144వ సెక్షన్ అమలులోకి రానుంది. ఇప్పటికే ముగ్గురు రౌడీ షీటర్లపై పీడీ చట్టం నమోదు చేశారు. ఎల్లుండి నుంచి మాదాపూర్ లో మెట్రోపొలిన్ సదస్సు ప్రారంభం కానుంది. అలాగే మాదాపూర్ డీసీపీగా కార్తికేయను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 2006 బ్యాచ్ కు చెందిన కార్తికేయ ప్రస్తుతం గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News