: కొందరు మారరు... శ్రీను వైట్లపై ప్రకాశ్ రాజ్ మండిపాటు
దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య వివాదం మరింత ముదిరింది. నిన్న ప్రకాశ్ రాజ్ శ్రీను వైట్ల మారాలని సూచిస్తూ మండిపడితే, నేడు శ్రీను వైట్ల ప్రకాశ్ రాజ్ పై విమర్శల వాన కురిపించారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్విట్లర్ వేదికగా స్పందించారు. ఫేస్ బుక్, ట్విట్టర్లో "కొందరు మారరు, 'తాటి చెట్టుకింద దొరికిపోయిన వాడిని ఏం చేస్తున్నావురా? అని అడిగితే పాలు తాగుతున్నా అని చెప్పాడంట' ఆల్ ది బెస్ట్" అంటూ ఓ వ్యాఖ్య పోస్టు చేశారు.