: పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడెమీ: కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు


అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడెమీని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు వెల్లడించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృత సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపరచనున్నామని మంత్రి చెప్పారు. విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పుట్టపర్తిలో ఏవియేషన్ అకాడెమీ ఏర్పాటు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు. చిన్న విమానాశ్రయాల వల్ల రవాణా రంగంతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

  • Loading...

More Telugu News