: కేంద్ర నిధులన్నీ ఏపీకి తరలుతున్నాయట!


రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వాపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ, కేంద్రం ఏపీ పేరిటే నిధులను విడుదల చేస్తోందని ఆయన శనివారం ఆరోపించారు. దీంతో తెలంగాణకు రావాల్సిన నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ కే తరలిపోతున్నాయని ఆయన వాదిస్తున్నారు. నిధులన్నీ ఏపీకి తరలిపోతున్నా, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పొంగులేటి విరుచుకుపడ్డారు. జేఎన్ఎన్ యూఆర్ఎం, ఎన్ఆర్ఎల్ఎం తదితర పథకాల కింద విడుదలవుతున్న నిధులు ఏపీకి తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. మూడు నెలల నుంచి ఇదే తంతు నడుస్తున్నా, కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫలితంగా ఈ మూడు నెలల కాలంలోనే రూ.10 వేల కోట్ల మేర నిధులను తెలంగాణ కోల్పోయిందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News