: సరితాదేవికి ఓసీఏ సీరియస్ వార్నింగ్
ఆసియా క్రీడల్లో మహిళల బాక్సింగ్ 60 కేజీల విభాగంలో మంచి ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని పొందినా, నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ క్రీడాకారిణి మెడలో వేసేసి వెళ్లిపోయిన సరితాదేవిని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) తీవ్రంగా హెచ్చరించింది. క్రమశిక్షణ ఉల్లంఘించానని ఒప్పుకుని, క్షమాపణ కోరడంతో ఓసీఏ ఆమెపై ఎలాంటి చర్య తీసుకోలేదు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఓసీఏ అధికారులు తెలిపారు. ఆమె భావోద్వేగంతో చేసిన తప్పిదమని భారత బృందం చెప్పడంతో హెచ్చరించి వదిలేయాలని ఓసీఏ నిర్ణయించింది. ఈ అంశంతో భారత బృందానికి సంబంధం లేదని, అది కేవలం ఒక్క అథ్లెట్ చేసిన పొరపాటని తాము భావిస్తున్నామని ఓసీఏ స్పష్టం చేసింది.