: గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్ని యాప్స్ ఉన్నాయో తెలుసా?
గూగుల్ ప్లే స్టోర్ లో ఎన్ని యాప్స్ ఉన్నాయో తెలుసా? అక్షరాలా 13 లక్షలకు పైగా యాప్స్ ఉన్నాయట. స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ ను మొబైల్ కంపెనీలు నిక్షిప్తం చేస్తున్నాయి. వార్తలు తెలుసుకునేందుకో యాప్, ఆటలు ఆడేందుకో యాప్, రోజువారీ జమా ఖర్చులు రాసేందుకో యాప్... ఇలా గూగుల్ ప్లే స్టోర్ లో లక్షల కొద్దీ యాప్స్ ఉన్నాయి. సందర్భానికి, అవసరానికి తగ్గట్టు గూగుల్ యాప్స్ ను అభివృద్ధి చేసింది. దీంతో ఆండ్రాయిడ్ ఓఎస్ ఉన్న ఫోన్లు కొనేందుకు యువత మక్కువ చూపుతున్నారు. అంతే కాకుండా ప్లే స్టోర్ నుంచి ఉచిత డౌన్ లోడ్ సౌకర్యం కూడా ఉండడంతో ఈ సౌకర్యమున్న ఫోన్లే తీసుకుంటున్నారు. యాపిల్, విండోస్, సింబయాస్ వంటి ఓఎస్ లు కలిగిన ఫోన్లలో యాప్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు పెద్దగా లేదు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్లవైపు యువత మొగ్గుచూపుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న 13 లక్షలకు పైగా ఉన్న యాప్స్ లో 11 లక్షల యాప్స్ మాత్రమే నాణ్యమైనవని గూగుల్ పేర్కొంది. అంతే కాకుండా ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ గ్రేడ్ అయిన ప్రతిసారి లక్షల కొద్దీ కొత్త యాప్స్ వచ్చి చేరిపోతుంటాయి.