: జన్మభూమిలో వెంకయ్యనాయుడు!
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి-మన ఊరు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. సాధారణంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అరుదు. అయితే వెంకయ్యనాయుడు ఆ తరహా నేత కాదు. మంచి కార్యక్రమమైతే ఎలాంటి పథకానికైనా ఆయన మద్దతు పలుకుతారు. మరోవైపు మోడీ సర్కారు మొన్న ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకయ్యనాయుడు కూడా, చంద్రబాబు చేతుల మీదుగా రూపుదిద్దుకున్న జన్మభూమిలో పాల్గొని, తన మద్దతు ప్రకటించారు.