: టీఆర్ఎస్ ప్రభుత్వంపై 'కారాలు, మిరియాలు' నూరుతున్న కేంద్ర ప్రభుత్వం


'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనకపోవడంపై కేంద్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశం మొత్తం ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జాతిపిత మహాత్మగాంధీ ఆశయసాధన లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై పీఎంవో కార్యాలయం అధికారులు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంపై నిర్లక్ష్య వైఖరి వహించిన టీఆర్ఎస్ సర్కార్ పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో, తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు, కేంద్రానికి మరింత దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం గవర్నర్ నరసింహన్ దంపతులు మాత్రమే కొందరు ఉద్యోగులతో కలసి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే టీఆర్ఎస్ సర్కార్ కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. చాలా విషయాల్లో టీఆర్ఎస్ వ్యవహారశైలి కేంద్రానికి నచ్చడం లేదు. కాశ్మీర్ భారత్ కు చెందదని ఎంపీ కవిత జాతీయ మీడియాలో చేసిన వ్యాఖ్యలు... నిజాం పాలన తిరిగి తెస్తామంటూ ఓ సందర్భంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ అనడం లాంటి విషయాలను కేంద్రం ఇప్పటికే తీవ్రంగా పరిగణిస్తోంది. వీటితో పాటు, తాజాగా స్వచ్ఛ భారత్ సంఘటన నేపథ్యంలో ఈ అగాథం మరింత పెరిగే అవకాశం ఉందని ఢిల్లీలోని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News