: అంగరంగ వైభవంగా అమ్మవారి తెప్పోత్సవం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కనకదుర్గ నవరాత్రులు అంగరంగ వైభవంగా ముగిసాయి. తుది ఘట్టమైన తెప్పోత్సవంలో భాగంగా కృష్ణా నదిలో గంగాపార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్లు లక్షలాది మంది భక్తులు వీక్షిస్తుండగా హంస వాహనంపై విహరించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ప్రకాశం బ్యారేజీ, పుష్కర్ ఘాట్లు జనసంద్రమయ్యాయి. దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగిసాయి.