: విశాఖ జిల్లాలో 12 అడుగుల బ్లాక్ కోబ్రాను చంపిన స్థానిక రైతులు
విశాఖ జిల్లా రావికమతం మండలం టి.అర్జాపురంలో ఓ భారీ బ్లాక్ కోబ్రాను స్థానిక రైతులు హతమార్చారు. గురువారం ఉదయం 12 అడుగులు ఉన్న ఈ నల్లత్రాచు ఎర్రచెరువు సమీపంలో స్థానికంగా ఉన్న మహిళలకు కనపడింది. మిన్నాగును (నల్లత్రాచు) చూడగానే మహిళలు, చిన్నారులు భయంతో కేకలు వేశారు. దీంతో, సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ముగ్గురు రైతులు కర్రలతో ఒకేసారి దాడిచేసి పామును చంపారు. ఇంతటి పామును తాము ఇప్పటివరకు చూడలేదని స్థానికంగా ఉన్న ప్రజలు అంటున్నారు.