: అమెరికాలో మోడీకి ఫేస్ బుక్ ఫాలోయింగ్ వెల్లువ!
ప్రధాని నరేంద్ర మోడీకి ఫేస్ బుక్ ఫాలోయింగ్, భారత్ కే పరిమితం కాలేదు. అగ్రరాజ్యం అమెరికాలోనూ వెల్లువెత్తుతోంది. ఆ దేశ రాజకీయ వేత్తలను తలదన్నే రీతిలో వెల్లువెత్తుతున్న ఈ ఫాలోయింగ్ ఏ తీరాలకు చేరుతుందో చూడాలి. ప్రస్తుతం ఆ దేశ కాంగ్రెస్ సభ్యులు, ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసే వారిలో చాలా మందికి ఉన్న ఫేస్ బుక్ ఫాలోయర్ల కంటే అధిక సంఖ్యలో మోడీకి ఉన్నారని ఆ దేశ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మోడీకి ఫేస్ బుక్ లో 1,70,529 మంది అమెరికన్ ఫాలోయర్లున్నారట. మాడిసన్ స్క్వేర్ వద్ద ప్రసంగం తర్వాత మోడీకి ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయిందట. ఇదిలా ఉంటే, మోడీ మాడిసన్ స్క్వేర్ కార్యక్రమం కొందరు అమెరికన్ పొలిటీషియన్లకు ఫాలోయర్లనూ పెంచిందట. ఎలాగంటే, సమ్మోహన శక్తి కలిగిన మోడీ సభకు హాజరైనందుకు తమపై ప్రశంసల వర్షం కురుస్తోందని అమెరికా చట్టసభ సభ్యులు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.