: మోడీ అమెరికా పర్యటన మాలో నమ్మకాన్ని పెంచింది: మోహన్ భగవత్


ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికాలో చేపట్టిన పర్యటన తమలో నమ్మకాన్ని పాదుకొల్పిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఆరెస్సెస్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భగవత్ ఈ మేరకు ప్రకటించారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన సంస్కృతి కలిగిన తాము పెద్దన్నలానే వ్యవహరించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలోని భిన్నత్వాన్ని అంగీకరిస్తున్న తాము ఇతరులపై తమ భావాలను రుద్దబోమని, ఇతరుల మనోభావాలకు భంగం కలిగించబోమని ఆయన చెప్పారు. 'మామ్' విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తల ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా భగవత్ కీర్తించారు.

  • Loading...

More Telugu News