: నేడు సచివాలయానికి చంద్రబాబు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలోని తన కార్యాలయంలో నేడు అడుగుపెట్టనున్నారు. దసరా పర్వదినాన ఆయన తన అధికారిక కార్యకలాపాలను లేక్ వ్యూ అతిథి గృహం నుంచి సచివాలయానికి మార్చుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తనకు కేటాయించిన ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్తులోని కార్యాలయంలో ఆయన అడుగుపెట్టనున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్యలో తన కొత్త కార్యక్షేత్రం నుంచి కార్యకలాపాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటిదాకా సీఎం కార్యాలయంగా కొనసాగిన సి బ్లాక్ తెలంగాణ సీఎంకు కేటాయించారు. ఏపీ సీఎం కోసం ఎల్ బ్లాకును కేటాయించారు. దీంతో ఎల్ బ్లాకులోని ఎనిమిదో అంతస్తులో చంద్రబాబు కోసం కొత్తగా కార్యాలయం రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో గురువారం దాకా లేక్ వ్యూ అతిథి గృహం నుంచి తన అధికారిక కార్యకలాపాలను కొనసాగించారు. శుక్రవారం నుంచి చంద్రబాబు తన కార్యకలాపాలను సచివాలయం నుంచి కొనసాగించేందుకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేశారు.

  • Loading...

More Telugu News