: బాసరలో వైభవంగా మహర్నవమి వేడుకలు
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో శుక్రవారం ఉదయం మహర్నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరు గంటలకే అమ్మవారికి పూర్ణాహుతి, అనంతరం మహాభిషేకం అలంకరణ గావించారు. దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారు సాయంత్రం నెమలి పల్లకిలో విహరించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాసరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.