: ప్రోటోకాల్ పై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వాగ్వాదం
ప్రోటోకాల్ పై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సూళ్లూరుపేటలో జరిగిన జన్మభూమి సభలో సభను నిర్వహించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటరత్నం వేదికపైకి వచ్చారు. దీనికి వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే సంజీవయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ప్రొటోకాల్ పాటించాలని సంజీవయ్య అధికారులను ఆదేశించారు.