: కర్ణాటక రవాణాశాఖపై ఓపక్క ఫేస్ బుక్ యుద్ధం... మరోపక్క సుప్రీంకోర్టులో కేసు!


కర్ణాటక రోడ్డు రవాణా శాఖపై ఆ రాష్ట్రేతరులు ఫేస్బుక్ యుద్ధం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు చట్టాల పేరుతో కర్ణాటకేతర వాహనదారులపై పన్ను మీద పన్నులు వడ్డిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వాహనం కొనేటప్పుడు అన్ని పన్నులు చెల్లించినా కర్ణాటకలో ప్రవేశించగానే మరోసారి అవే పన్నులు విధిస్తున్నారు. ఎందుకలా? అని అడిగితే పన్ను కట్టకపోతే వాహనాన్ని తీసుకుపోతామంటూ అధికారులు బెదిరిస్తున్నారు. ఏదయినా సంస్థలో ఉద్యోగులైతే వారి ఐడి కార్డులు తీసుకుని ఇచ్చేది లేదంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక్కడికి వచ్చే ఉద్యోగులనే కాకుండా, చుట్టపు చూపుగా వచ్చేవారిని కూడా వేధిస్తున్నారు. దీంతో బాధితులు కొందరు ఫేస్ బుక్ పేజీ తెరిచారు. దీనికి మంచి స్పందన లభించింది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది కర్ణాటకేతరులు ఫేస్బుక్లో తమ బాధలు వెల్లడిస్తూ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థపై యుద్ధం ప్రకటించారు. అయినా ఫలితం లేకపోవడంతో, కర్ణాటక రోడ్డు రవాణా శాఖపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి, కర్ణాటక రోడ్డు రవాణా శాఖను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈనెల 10న విచారణకు రానుంది.

  • Loading...

More Telugu News