: పన్నీర్ సెల్వంను కలిసేందుకు జయలలిత నిరాకరణ, బాధతో వెనక్కి మళ్లిన సీఎం


అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు ఇటీవల సెంట్రల్ జైల్ కు వచ్చిన సీఎం పన్నీరు సెల్వంకు చుక్కెదురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, సోమవారం సాయంత్రం బెంగళూరు చేరుకున్న ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వెంటనే హుటాహుటిన బెంగుళూరు సెంట్రల్ జైల్ కు వెళ్లారు. అయితే, అప్పటికే సమయం ఆరు కావడంతో జైలు అధికారులు జయలలితను కలవడానికి అనుమతి నిరాకరించారు. దీంతో, ఆయన మంగళవారం ఉదయం జయలలితను కలిసేందుకు మళ్లీ సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఈసారి, జైలు అధికారుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురవనప్పటికీ అధినేత్రి నుండి ఆయనకు చుక్కెదురైంది. పన్నీర్ సెల్వంను కలిసేందుకు జయలలిత నిరాకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాటిమాటికీ జైలు చుట్టూ తిరగడం కరెక్ట్ కాదని, ముఖ్యమంత్రిగా పాలనపై దృష్టిలో పెట్టాలని పన్నీర్ సెల్వంకు జయలలిత సమాచారం పంపించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆయన అక్కడినుంచి వెళ్లకుండా మధ్యాహ్నం వరకు జైలు ఆవరణలోనే గడిపి ఆ తర్వాత బాధతో వెనక్కి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News