: వైసీపీలో జగన్ తర్వాతి స్థానం విజయసాయిరెడ్డిదే?


వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీలకు ఆడిటర్‌గా వ్యవహరిస్తూ, ఆయనకు ఆర్థిక సలహాదారుగా పనిచేస్తోన్న విజయసాయిరెడ్డి తాజాగా పార్టీ వ్యవహారాల్లో కూడా చురుకైన పాత్రను పోషిస్తున్నారని సమాచారం. ఇటీవలే, విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు జగన్. ఈ హోదా లభించిన తర్వాత ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రతి రోజూ, ఉదయం 8 గంటలకే హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకుని, పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారని సమాచారం. వైసీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను, జిల్లాల పార్టీ వ్యవహారాలను ప్రస్తుతం విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వైసీీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో జగన్ తర్వాత స్థానం ప్రస్తుతానికి విజయసాయిరెడ్డిదేనని రాజకీయవర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News