: ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభం... ఇకపై ఏపీలో రూ.2కే 20లీటర్ల మినరల్ వాటర్
ఎన్టీఆర్ సుజల పథకాన్ని విజయవాడలో చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ ను ప్రభుత్వం ప్రజలకు అందించనుంది. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మినరల్ వాటర్ ఫ్లాంట్ లు ఏర్పాటు చేసి విద్యార్థులకు సురక్షిత మంచినీరు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది.