: మహిళా సాధికారత కోసం ఐరాసకు రూ.6 కోట్ల భారత్ సాయం


ప్రపంచ దేశాల్లో లింగ వివక్షను రూపుమాపి, మహిళా సాధికారత సాధించే దిశగా ఐక్యరాజ్య సమితి చేస్తున్న కృషికి భారత్ తన వంతు సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 6 కోట్లను భారత్, ఐరాసకు అందించింది. అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ మేరకు చెక్కును ఐరాస మహిళా సాధికారత సంస్థ అండర్ సెక్రటరీ జనరల్ ఫుంజిలే మాంబ్లోకు అందించారు. ఏటా మిలియన్ డాలర్ల మేర సహాయం చేస్తానన్న హామీలో భాగంగా భారత్ ఈ ఏడాది ఈ నిధులను ఐరాసకు అందించింది. తాజా సహాయంతో ఈ విభాగానికి భారత్ ఇప్పటిదాకా 5 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయాన్ని ఐరాసకు అందించినట్లైంది.

  • Loading...

More Telugu News