: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన


అదేంటీ, ఫ్లైటెక్కేందుకు కదా ఎయిర్ పోర్టుకు వెళ్లేది, ఆందోళన చేసేందుకు కాదు కదా అనుకుంటున్నారా? తెల్లవారుజామున రావాల్సిన విమానం, సమయం దాటిపోతున్నా కనపడకపోతే ఆందోళన చేయక ఏం చేస్తాం చెప్పండి. ఇలాంటి సీను గురువారం హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించింది. మస్కట్ వెళ్లాల్సిన విమానం గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకే అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే ఉదయం 8.30 గంటలవుతున్నా విమానం జాడ కనిపించలేదు. అసలు విమానం ఎక్కడుందయ్యా? అంటే స్పందించే నాథుడే కరవయ్యాడు. దీంతో ఆ విమానంలో మస్కట్ వెళ్లాల్సిన ప్రయాణీకులు, వారికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన వారి బంధువులు విమానాశ్రయంలోనే ఆందోళనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు ఉన్నతాధికారులు దిగొచ్చి, ప్రయాణికులను శాంతింపజేశారు. మరికొద్దిసేపటిలో విమానాన్ని ఏర్పాటు చేస్తామన్న అధికారుల హామీతో ప్రయాణికులు ఆందోళన విరమించారు.

  • Loading...

More Telugu News