: బతుకమ్మ వేడుకలో అపశృతి
నల్గొండ జిల్లాలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. నకిరేకల్ పట్టణం ప్రధాన కూడలిలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో ప్రజా ప్రతినిధులు కూర్చునేందుకు తయారు చేసిన వేదిక కుప్పకూలింది. దీంతో వేదికపై కూర్చున్న ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు కుర్చీల్లోనే ఒరిగిపోయారు. వారి గన్ మెన్లు మాత్రం కిందపడిపోయారు. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అందరూ సర్దుకున్న అనంతరం తిరిగి సంబరాలు ప్రారంభమయ్యాయి.