: వివాదం రేపిన సోనియా, ప్రియాంక గాంధీల ఫ్లెక్సీలు


కాదేదీ ప్రచారానికి కనర్హం అన్న రీతిలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు బతుకమ్మ ఉత్సవాలను వినియోగించుకుంటున్నారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమాన నేతలకు స్వాగతాలు, ప్రజలకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల ఫ్లెక్సీలు తొలగించడం వివాదానికి దారి తీసింది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ట్యాంక్ బండ్ పరిసరాల్లో సోనియా, ప్రియాంక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని కార్పొరేషన్ అధికారులు తొలగించారు. కేవలం తమ నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించడం లేదని వారు ప్రశ్నించారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల ఫ్లెక్సీలు తొలగిస్తే, బతుకమ్మ సంబరాల వద్ద నిరసనకు దిగుతామని వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News