: రాజకీయ పక్షాలకు ఈసీ ఆదేశం


పార్టీల ఫండ్స్ పై రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాజకీయ పక్షాలు తమ నిధులను బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నేటి నుంచే తమ ఆదేశాలు అమలులోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో పార్టీల ఫండ్స్ లావాదేవీలపై రికార్డులు నమోదవుతాయి. దీంతో వాటికి ఆదాయపు పన్ను, నిధుల లెక్కలు, విదేశీ ఫండ్స్ వెల్లువ వంటివన్నీ అధికారికంగా నమోదవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈసీ నిర్ణయంతో పార్టీల జమాఖర్చులకు మూలాలు బట్టబయలవుతాయని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News