: 'ఇస్' ఉగ్రవాదులతో యుద్ధం చేయం... సహాయం మాత్రం చేస్తాం: కేంద్రం
పశ్చిమాసియాలోని సిరియా, ఇరాక్ దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ (ఇస్) తీవ్రవాదులపై భారత దేశం యుద్ధం చేయదని భారత విదేశాంగ శాఖాధికారులు తెలిపారు. సిరియా, ఇరాక్ లోని ఇస్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో భారత్ పాలుపంచుకోదని వారు స్పష్టం చేశారు. అయితే ఆ రెండు దేశాల్లోని ప్రజలను ఉగ్రవాద దాడుల నుంచి, వారి ప్రభావం నుంచి కాపాడేందుకు అమెరికాతో కలిసి పని చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసిందని విదేశాంగ శాఖాధికారులు వెల్లడించారు. యువత ఉగ్రవాదం వైపు మొగ్గుచూపడం చాలా పెద్ద విషయమని, అలా జరగకుండా చూడాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు.