: ఈ హాస్య నటుడు చాలా డేంజరండోయ్!


హాలీవుడ్ హాస్య నటుడు, హోస్ట్ జిమ్మీ కిమెల్ ను ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా మెక్ ఆఫీ ప్రకటించింది. గత ఎనిమిదేళ్లుగా ప్రతి ఏటా కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెక్ ఆఫీ సైబర్ ప్రపంచంలో ప్రమాదకరమైన వైరస్ లను గుర్తించి, వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. డేంజరస్ సెలబ్రిటీ 2014 జాబితా విడుదల చేసిన మెక్ ఆఫీ జిమ్మీ కిమెల్ ను ప్రమాదకారిగా గుర్తించింది. ఆన్ లైన్ లో అతని కోసం ఐదు సార్లు వెతికితే అందులో ఒకసారి వైరస్ వ్యాపించే అవకాశముందని మెక్ ఆఫీ తెలిపింది. ఆయన పేరుతో వైరస్ ముప్పు సాధారణం కంటే 19 శాతం ఎక్కువని ఆ సంస్థ వెల్లడించింది.

  • Loading...

More Telugu News