: పాము కాటేసిన మేక మాంసాన్ని తిని ఆసుపత్రి పాలయ్యారు!


తమిళనాడులో పాము కాటేసిన మేక మాంసాన్ని తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. పెరియ కదంబూరులో జరిగిందీ ఘటన. బాధితులు మేకను ఓ రైతు నుంచి కొనుగోలు చేశారు. దాని మాంసం తిన్న వెంటనే వారు అస్వస్థతకు లోనయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఫుడ్ పాయిజనింగ్ అనుకుని చికిత్స మొదలుపెట్టారు. అయితే, ఆ మేకను పాము కరిచిందని గ్రామస్తులు చెప్పడంతో, తగిన చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News