: ఆ సీఐ సస్పెండ్ అయ్యాడు!
పుణ్యక్షేత్రమైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడిన సీఐ ప్రసాద్ ను సస్పెండ్ చేశారు. ఇంద్రకీలాద్రిపై విధులు నిర్వర్తిస్తూ నీలి చిత్రాలు చూస్తుండడాన్ని వార్తా ఛానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర స్థలమన్న ఇంగితం లేకుండా ప్రవర్తిస్తే ఎలా? అని ఆయన మండిపడ్డట్టు సమాచారం. తక్షణం ఆయనను విధుల నుంచి తప్పించాలని బాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.