: మేరీ కోమ్ ఓ పులి: ప్రియాంక చోప్రా
ఆసియా క్రీడల బాక్సింగ్ లో పసిడి చేజిక్కించుకున్న స్టార్ బాక్సర్ మేరీ కోమ్ పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రశంసల జల్లు కురిపించింది. మేరీ కోమ్ ఓ పులి అని ప్రియాంక అభివర్ణించింది. ఇటీవలే మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన 'మేరీ కోమ్' సినిమాలో ప్రియాంకా చోప్రా లీడ్ రోల్ పోషించింది.