: దుర్గాపూజ మంటపంలో 'క్రికెట్ గాడ్' ప్రతిమలు... కామెంట్రీ బాక్సులో అమ్మవారు


కోల్ కతాలోని ఓ దుర్గా పూజ మంటపాన్ని వినూత్నంగా రూపొందించారు. మంటపాన్ని క్రికెట్ స్టేడియం రూపంలో ఏర్పాటు చేసి, అందులో 10 సచిన్ ప్రతిమలు ఉంచారు. ఇక, దుర్గామాత ఎక్కడ ఉంటుందంటారా..? అమ్మవారిని కామెంట్రీ బాక్సులో కూర్చోబెట్టారు సదరు భక్త మహాశయులు. కోల్ కతా నగర శివారు ప్రాంతం సోనార్పూర్ వెళితే ఈ క్రికెట్ మంటపాన్ని చూడొచ్చు. రైల్ కాలనీ సర్బోజనిన్ దుర్గా పూజ కమిటీ ఈ మంటపం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యుల్లో అత్యధికులు సచిన్ ఫ్యాన్ క్లబ్ కు చెందినవారే. ఈ మంటపంలో వివిధ భంగిమల్లో సచిన్ ప్రతిమలు దర్శనమిస్తాయి. బ్యాటింగ్ చేస్తూ, బంతి విసురుతూ, కీపింగ్ చేస్తూ, బంతిని ఆపుతూ... ఇలాగన్నమాట. సాధారణ అలంకార లైటింగ్ కు బదులు స్టేడియం తరహా వాతావరణం కోసం ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే... ఇక్కడ అమ్మవారి భక్తిగీతాలు వినిపించవు. ఆ స్థానంలో... సచిన్ ఆడిన మ్యాచ్ లకు రవిశాస్త్రి చెప్పిన కామెంటరీ వినిపిస్తుంది. పాతికేళ్ళుగా తన ప్రతిభాపాటవాలతో జాతిని అలరించిన వ్యక్తికి తాము అందించే నీరాజనం అని మంటపం నిర్వాహకుడు నీలేందు బసు సచిన్ పై అభిమానాన్ని చాటారు.

  • Loading...

More Telugu News