: కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్
విజయవాడ కనకదుర్గమ్మను నటుడు రాజేంద్రప్రసాద్ నేడు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్ కుటుంబానికి స్వాగతం పలికారు. కాగా, ఇంద్రకీలాద్రిపై భక్తుల విశ్రాంతి మందిరం నిర్మించేందుకని రాజేంద్రప్రసాద్ ఆర్నెల్ల క్రితం రూ.15 లక్షలు విరాళంగా అందజేశారు. విశ్రాంతి మందిరానికి సంబంధించి నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభం కాలేదన్న విషయాన్ని ఆయన ఈవో త్రినాథరావును అడగ్గా, దసరా తర్వాత నిర్మాణ పనులు చేపడతామని ఈవో సమాధానమిచ్చారు. కాగా, నవరాత్రుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది.