: వచ్చేవారంలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడి భారత్ పర్యటన


ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ వచ్చే వారం భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 9, 10న న్యూఢిల్లీలో జరిగే తొలి ఇంటర్నెట్.ఓఆర్ జీ (internet.org) సదస్సుకు హాజరై ప్రసంగించనున్నారు. అంతేగాక, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర మంత్రివర్గ సభ్యులతో కూడా జుకెర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తరువాత భారత్ సందర్శించనున్న మూడో 'హై-ఫై' సీఈవో జుకెర్ బర్గ్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News