: బెజవాడ దుర్గగుడి ఆవరణలో నీలిచిత్రాలు చూస్తున్న సీఐ... భక్తుల ఆగ్రహం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ గుడి పవిత్రతను ఓ సీఐ మంటగలిపాడంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఐ ప్రసాద్ గుడి ఆవరణలో మొబైల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కాడు. బందోబస్తు విధుల్లో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని భక్తులు సదరు సీఐపై మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.