: కోఠి వైద్య విద్య కార్యాలయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాదు కోఠిలోని వైద్య విద్య కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రూరల్ సర్వీస్ కౌన్సెలింగ్ ను అడ్డుకునేందుకు జూనియర్ డాక్టర్లు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, జూడాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం జూడాలు కార్యాలయం గేటు వద్ద బైఠాయించారు.