: కరాచీలో పాప్ గాయని పాఠశాల
మడోన్నా పాప్యులర్ పాప్ గాయకురాలే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలోనూ అగ్రగామే. తనకు మంచి గొంతే కాదు, మంచి మనసుందని కూడా నిరూపించుకుంది. తాజాగా, పాకిస్థాన్ లోని కరాచీ నగర శివార్లలో 'డ్రీమ్ మోడల్ స్ట్రీట్ స్కూల్' పేరిట ఓ పాఠశాల ప్రారంభించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తనే తెలిపింది. ఇప్పటికే 1200 మంది విద్యార్థులు స్కూల్లో చేరారని చెప్పింది. అధునాతన సౌకర్యాలతో ఉన్న స్కూల్ ఫోటోలను ట్విట్టర్లో ఆమె షేర్ చేసింది. బాలికలకు విద్యావకాశాలు పెంపొందించే లక్ష్యంగానే ఈ పాఠశాలను మడోన్నా ప్రారంభించింది.