: తిరుమలకు కాలినడకన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు నేడు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. రెండు రోజుల క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ దత్తు, తొలిసారిగా ప్రధాన న్యాయమూర్తి హోదాలో తిరుమలకు రానున్నారు. సాధారణంగా స్వామివారి దర్శనానికి వచ్చే ప్రముఖులు తిరుపతి నుంచి వాహనాల్లోనే తిరుమల చేరుకుంటారు. అయితే, అందుకు భిన్నంగా జస్టిస్ దత్తు తిరుపతి నుంచి కాలి నడకన తిరుమల చేరుకోనున్నారు. నేటి సాయంత్రం శ్రీవారి గజవాహన సేవలో పాల్గొనే ఆయన, గురువారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుంటారు.