: బీజేపీ నేత నితిన్ గడ్కరీతో రాజ్ ఠాక్రే రహస్య మంతనాలు!


ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి అటు దూరంగా జరిగాడో, లేదో... ఇటు, ఆ పార్టీతో రాజ్ ఠాక్రే సన్నిహితంగా మెలిగేందుకు సిద్ధమయ్యాడు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంగళవారం మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి అధ్యక్షుడు రాజ్ ఠాక్రే విదర్భలో భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు తమ పార్టీల మధ్య పొత్తు అంశంపై చర్చించినట్లు సమాచారం. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు గెలిచిన ఎంఎన్ఎస్, ఈ దఫా ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొన్నటిదాకా బీజేపీతో సోదరుడి నేతృత్వంలోని శివసేన పొత్తు కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే సీట్ల కేటాయింపు విషయంలో తలెత్తిన విబేధాల నేపథ్యంలో 25 ఏళ్ల మైత్రికి శివసేన, బీజేపీ స్వస్తి పలికాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యనేతతో రాజ్ ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News