: స్వదేశం బయలుదేరిన ప్రధాని మోడీ!
ఐదు రోజుల అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం స్వదేశం బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరిన మోడీకి వాషింగ్టన్ డీసీ విమానాశ్రయంలో అమెరికా అధికారులు, అక్కడి ప్రవాస భారతీయులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఐదు రోజుల పాటు ఊపిరిసలపని కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన మోడీ, నేటి రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.