: సచిన్ ను మళ్లీ కలవాలనుకుంటున్న టెన్నిస్ సూపర్ స్టార్
స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ క్రికెట్ ప్రేమికుడు. అందులోనూ, బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ కు ఇతగాడు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) లో పాల్గొనేందుకు ఈ ఏడాది చివర్లో భారత్ రానున్న ఫెదరర్, ఆ సమయంలో సచిన్ ను కలవాలనుకుంటున్నాడట. ఈ మేరకు ఫెదరర్ ఏజెంట్ టోనీ గాడ్సిక్ తెలిపాడు. ఇంతకుముందు వింబుల్డన్ సందర్భంగా సచిన్, ఫెదరర్ రెండుసార్లు కలిశారని గాడ్సిక్ చెప్పాడు. త్వరలో భారత్ రానున్న సందర్భంగా, సచిన్ ను కలవాలని ఫెదరర్ భావిస్తున్నాడని పేర్కొన్నాడు. ఫెదరర్ తల్లి దక్షిణాఫ్రికా జాతీయురాలు కావడం, కెరీర్ లో తొలి కోచ్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే ఫెదరర్ కు క్రికెట్ పై ఆసక్తి కలిగిందని గాడ్సిక్ వివరించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో క్రికెట్ క్రీడ పట్ల ఉన్న ఆదరణ తెలియందికాదు.